ఐఏఎస్ అధికారి కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన మంత్రి నారా లోకేశ్.. ఫొటోలు ఇవిగో!

Minister Nara Lokesh attends engagement of IAS officer daughter
  • ఐఏఎస్ అధికారి భట్టు అంబేద్కర్ కుమార్తె నిశ్చితార్థం
  • మంగళగిరిలో జరిగిన వేడుకకు హాజరైన మంత్రులు
  • మంత్రి లోకేశ్, అనగాని సత్యప్రసాద్‌ల సందడి
  • వధూవరులు జెహారిక, రాహుల్ దీప్‌ను ఆశీర్వదించిన నేతలు
 సీనియర్ ఐఏఎస్ అధికారి, ఏపీ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్ భట్టు అంబేద్కర్ కుమార్తె నిశ్చితార్థ వేడుక మంగళగిరిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఆయనతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ శ్రీభరత్ కూడా పాల్గొన్నారు.

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో మంత్రులు సందడి చేశారు. కాబోయే దంపతులు జెహారిక, రాహుల్ దీప్‌లను మంత్రి లోకేశ్, ఇతర నేతలు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించి, నూతన జంటకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Advertisement
Nara Lokesh
Bhattu Ambedkar
Anagani Satya Prasad
Mangalagiri
IAS officer daughter engagement
Sri Bharat MP

More Telugu News