"నా బెడ్‌రూమ్‌లో గబ్బిలంలా వేలాడారా?".. బాబా రాందేవ్‌పై కంగనా ఫైర్‌

Kangana Ranaut fires at Baba Ramdev for comments on her past life
  • తన గతంపై వదంతుల గురించి మాట్లాడొద్దన్న కంగనా
  • రాందేవ్‌ వ్యాపార విస్తరణపై కంగనా విమర్శలు
  • యోగా, ఆయుర్వేదం నుంచి వ్యాపారం వైపు వెళ్లారని ఆరోపణ
  • జెన్‌-జీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం
  • రాందేవ్‌ ప్రశ్నలకు కంగనా ఇప్పుడు కౌంటర్‌
బాబా రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ మరోసారి తీవ్రంగా స్పందించారు. తన చిన్ననాటి జీవితం, యవ్వనం, గతం గురించి రాందేవ్‌ మాట్లాడటంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ఆయన తన బెడ్‌రూమ్‌లో గబ్బిలంలా వేలాడారా? అని ప్రశ్నించారు.

రాందేవ్‌ తన గురించి మాట్లాడే ముందు ఆయనకు ఏం తెలుసో చెప్పాలని కంగనా అన్నారు. తన యవ్వనాన్ని ఆయన చూశారా? ఏం చూశారు? అని ప్రశ్నించారు. కేవలం వదంతులు, గాసిప్‌ ఆధారంగా వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం సరికాదని అన్నారు.

రాందేవ్‌ యోగా, ఆయుర్వేదం నుంచి వ్యాపార సామ్రాజ్యం వైపు వెళ్లిపోయారని కంగనా విమర్శించారు. స్వదేశీ ఉద్యమం సమయంలో ప్రభుత్వం కూడా ఆయనకు ప్రోత్సాహం ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఆయన పూర్తిగా వ్యాపారవేత్తగా మారారని వ్యాఖ్యానించారు. వ్యాపారం చేయడంలో తప్పులేదని, కానీ తాను కానిది అయినట్లు కనిపించకూడదని అన్నారు.

జెన్‌-జీపై కంగనా చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. యువతను ఉద్దేశించి ఆమె ‘జనరేషన్‌ గట్టర్‌’ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాందేవ్‌ స్పందించారు. ఆమె అర్హతలు, చిన్ననాటి జీవితం, యవ్వనం, గతం గురించి ప్రశ్నించారు. దీంతో కంగనా ఇప్పుడు రాందేవ్‌పై ఎదురుదాడికి దిగారు.
Advertisement
Kangana Ranaut
Baba Ramdev
BJP MP
Bollywood actress
Generation Gutter controversy
Yoga guru business empire

More Telugu News