59 కోట్లకు చేరిన జన్‌ధన్ ఖాతాలు.. వీటిల్లో ఎంత డబ్బుందో తెలుసా?
- ఖాతాల్లో రూ.3.17 లక్షల కోట్ల డిపాజిట్లు
- మహిళల పేరిట 56 శాతం ఖాతాలు
- 78 శాతం ఖాతాలు గ్రామీణ ప్రాంతాల్లో
- ఒక్కో ఖాతాలో సగటు డిపాజిట్ రూ.5,356
- రూపే కార్డుతో రూ.2 లక్షల బీమా
దేశంలో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల సంఖ్య 59 కోట్లు దాటింది. ఈ ఖాతాల్లో మొత్తం రూ.3.17 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. 2014 ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
జన్‌ధన్ ఖాతాల్లో 78 శాతం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. సుమారు 56 శాతం ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. పేదలు, మారుమూల ప్రాంతాల ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
2026 ఆగస్టు 19 నాటికి ఒక్కో ఖాతాలో సగటున రూ.5,356 ఉన్నాయి. గత 12 ఏళ్లలో ఒక్కో ఖాతాకు సగటు డిపాజిట్ 3.4 రెట్లు పెరిగింది. ఖాతాలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారని, పొదుపు అలవాటు పెరిగిందని ఇది సూచిస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది.
జన్‌ధన్ ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డు లభిస్తుంది. దీనితో రూ.2 లక్షల ప్రమాద బీమా ఉంటుంది. అత్యవసర సమయంలో రూ.10 వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఉంది. జన్‌ధన్-ఆధార్-మొబైల్ (జేఏఎం) వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతోంది. మధ్యవర్తులు, జాప్యానికి అవకాశం లేకుండా ఆర్థిక సాయం అందుతోందని కేంద్రం తెలిపింది.