రైడింగ్‌ స్టైల్‌ మార్చుకోవచ్చు.. యమహా కొత్త బైక్‌లో ఈ ఫీచర్‌ అదుర్స్‌!

Yamaha YZF-R2 launched in India with impressive riding modes and features
  • యమహా వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌2 భారత్‌లో విడుదల
  • ప్రారంభ ధర రూ.2.30 లక్షలు
  • టాప్‌ ఆర్‌2ఎం ధర రూ.2.53 లక్షలు
  • సెప్టెంబర్‌ నుంచి డెలివరీలు ప్రారంభం
  • 204 సీసీ ఇంజిన్‌ 26.1 బీహెచ్‌పీ శక్తినిస్తుంది
యమహా మోటార్‌ ఇండియా కొత్త స్పోర్ట్స్‌ బైక్‌ వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌2ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.2.30 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). టాప్‌ వేరియంట్‌ ఆర్‌2ఎం ధర రూ.2.53 లక్షలు. సెప్టెంబర్‌ 2026 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఆర్‌15 తర్వాత ఆర్‌-సిరీస్‌లో మరో బైక్‌గా వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌2 చేరింది.

వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌2లో కొత్తగా రూపొందించిన ఛాసిస్‌ ఇచ్చారు. ఆర్‌15తో పోలిస్తే దీని బరువు రెండు కిలోలకు పైగా తగ్గింది. అయినా ఛాసిస్‌ దృఢత్వాన్ని కొనసాగించారు. బైక్‌ మొత్తం బరువు 149 కిలోలు. దీంతో ఈ విభాగంలో తేలికైన బైక్‌గా నిలిచింది.

ఈ బైక్‌లో కొత్త 204 సీసీ, లిక్విడ్‌-కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 26.1 బీహెచ్‌పీ శక్తిని, 19.1 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు గేర్ల గేర్‌బాక్స్‌ ఇచ్చారు. స్లిప్‌ అండ్‌ అసిస్ట్‌ క్లచ్‌ ప్రామాణికంగా వస్తుంది. మిడ్‌, ఎమ్‌ వేరియంట్లలో క్విక్‌షిఫ్టర్‌ కూడా ఉంటుంది.

బైక్‌ ముందు భాగంలో 282 మిల్లీమీటర్ల డిస్క్‌ బ్రేక్‌ ఉంది. వెనుక వైపున కూడా డిస్క్‌ బ్రేక్‌ ఇచ్చారు. ముందు ఇన్వర్టెడ్‌ ఫోర్కులు, వెనుక మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఉన్నాయి. 17 అంగుళాల వీల్స్‌ ఉన్నాయి. సీటు ఎత్తు 810 మిల్లీమీటర్లు.

ఆర్‌-సిరీస్‌ తరహాలోనే వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌2 డిజైన్‌ చేశారు. ఫుల్‌ ఫెయిరింగ్‌, ఎల్‌ఈడీ లైట్లు, డీఆర్‌ఎల్స్‌, షార్ప్‌ టెయిల్‌ దీని స్పోర్టీ లుక్‌ను పెంచుతున్నాయి. మెటాలిక్‌ బ్లాక్‌, డార్క్‌ బ్లూయిష్‌ గ్రే, మ్యాట్‌ వైట్‌ పెర్ల్‌, రేసింగ్‌ బ్లూ, మెటాలిక్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది.

రైడర్లు స్ట్రీట్‌, రెయిన్‌, స్పోర్ట్‌, కస్టమ్‌ అనే నాలుగు రైడింగ్‌ మోడ్‌లను ఎంచుకోవచ్చు. ఆర్‌2ఎంలో టీఎఫ్‌టీ స్క్రీన్‌, స్మార్ట్‌ కీ, అడ్జస్టబుల్‌ లివర్ల వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
Advertisement
Yamaha YZF-R2
Yamaha Motor India
Sports Bike India
Yamaha R2 Price
Yamaha R2 Features
New Yamaha Bike Launch

More Telugu News