లాల్ దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ సందడి.. అమ్మవారిని దర్శించుకున్న స్టార్ హీరో!
- లాల్ దర్వాజా సింహవాహిణి అమ్మవారిని దర్శించుకున్న రౌడీ హీరో
- సోదరుడు ఆనంద్, దర్శకుడు సందీప్ వంగాతో కలిసి ప్రత్యేక పూజలు
- బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లింపు
- విజయ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు
హైదరాబాద్‌లో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
బోనాల పండుగ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఈ ముగ్గురూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కలిసి ఆలయానికి రావడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. తమ అభిమాన హీరో వచ్చాడని తెలుసుకున్న ఫ్యాన్స్, స్థానిక యువత ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
దర్శనం అనంతరం బయటకు వస్తున్న విజయ్ దేవరకొండను ఫోటోలు తీసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఆలయ పరిసరాల్లో కాసేపు కోలాహలం నెలకొంది. ప్రతి ఏటా జరిగే బోనాల ఉత్సవాల్లో సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.