కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ నాయకత్వంలో హైదరాబాద్ యువకుడు
- జాతీయ మీడియా కోఆర్డినేటర్‌గా విజయ్‌రెడ్డి మల్లంగి నియామకం
- సోనమ్ వాంగ్‌చుక్‌తో ఉద్యమంలో పాల్గొని గుర్తింపు
- అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగం వదిలి సామాజిక సేవ కోసం భారత్‌కు
హైదరాబాద్‌కు చెందిన యువ సామాజిక కార్యకర్త విజయ్‌రెడ్డి మల్లంగి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జాతీయ మీడియా సమన్వయకర్తగా, దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జిగా ఆయన నియమితులయ్యారు. గురువారం ప్రకటించిన సీజేపీ తొలి జాతీయ నాయకత్వ బృందంలో ఒక తెలుగు యువకుడికి చోటు దక్కడం విశేషం.
హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన విజయ్‌రెడ్డి, ఇక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. అయితే, పూర్తిస్థాయిలో సామాజిక సేవ చేయాలనే ఆకాంక్షతో ఉద్యోగం వదిలి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.
కళాశాల రోజుల నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విజయ్, 'సేవ్ కేబీఆర్', 'కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణ' వంటి స్థానిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవల సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో 45 రోజుల పాటు జరిగిన నిరసనల్లో ఆయనకు సహాయకుడిగా ఉంటూ, కార్యక్రమాల సమన్వయకర్తగా పనిచేశారు. ఆ సమయంలో విజయ్‌రెడ్డి అంకితభావాన్ని గుర్తించిన సీజేపీ ప్రతినిధులు, ఆయనకు జాతీయ కమిటీలో బాధ్యతలు అప్పగించారు.
సీజేపీ అనేది రాజకీయ పార్టీ కాదని, స్థానిక సమస్యలపై పార్టీలకతీతంగా పోరాడే ఉద్యమ వేదిక అని విజయ్‌రెడ్డి తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, సీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.