కొత్త ఉద్యమానికి కాక్రోచ్ పార్టీ శ్రీకారం.. దేశవ్యాప్తంగా ‘క్యా బోల్తీ పబ్లిక్?’
- సెప్టెంబర్ నుంచి ‘క్యా బోల్తీ పబ్లిక్?’ ప్రచారం
- దేశవ్యాప్తంగా ప్రజలతో నేరుగా సంభాషణ
- విద్య వ్యాణిజ్యీకరణపై సీజేపీ విమర్శలు
- ఫీజుల భారం తగ్గించాలని డిమాండ్
- నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా ప్రస్తావన
- ఎన్నికలకు దూరంగా ఉంటామని స్పష్టీకరణ
జంతర్‌మంతర్‌లో నీట్ ప్రశ్నాపత్రం లీక్‌లపై చేపట్టిన ఆందోళనల తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్ణయించింది. సెప్టెంబర్ నుంచి ‘క్యా బోల్తీ పబ్లిక్?’ పేరుతో దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ప్రకటించారు.
ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన రెండు రోజుల జాతీయ కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత దీప్కే మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, యువత, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
దేశంలో విద్య పూర్తిగా వ్యాపారంగా మారిందని దిప్కే విమర్శించారు. మొదటి తరగతి ప్రవేశానికే రూ.లక్షల ఫీజులు, భారీ విరాళాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యతరగతి, ఉద్యోగ కుటుంబాలు పిల్లలను చదివించడం భారంగా మారిందన్నారు. ఉన్నత విద్య, కోచింగ్ పేరుతో తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్య ప్రతి ఒక్కరి హక్కని, అది అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నీట్ అక్రమాలపై జరిగిన ఆందోళనల్లో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారని దిప్కే గుర్తుచేశారు. దేశంలో నిరుద్యోగం కూడా అత్యంత కీలక సమస్యగా మారిందన్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘంపై ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. అధికారాన్ని ప్రశ్నించే స్వతంత్ర పాత్రను మీడియా పోషించాలని కోరారు.
సీజేపీ ఎన్నికల్లో పోటీ చేయదని, ప్రజల హక్కుల పరిరక్షణ, పాలనలో సంస్కరణల కోసం ఒత్తిడి తెచ్చే శక్తిగా పనిచేస్తుందని దిప్కే స్పష్టం చేశారు.