నారాయణపేటలో తరగతి గదిలోనే కాటేసిన పాము.. విద్యార్థి మృతి

Student dies after snake bite in Narayanpet classroom
  • నారాయణపేట జిల్లాలో విషాద ఘటన
  • ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో విద్యార్థికి పాముకాటు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు రంజిత్ మృతి
  • ఏక్లాస్‌పూర్ గ్రామంలో అలముకున్న విషాదఛాయలు
తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలోనే విద్యార్థి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఏక్లాస్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రంజిత్ (8) అనే బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో పాఠాలు వింటున్న సమయంలో రంజిత్‌ను పాము కాటువేసింది. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై, బాలుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందాడు. కళ్లముందే ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ హృదయవిదారక ఘటనతో ఏక్లాస్‌పూర్ గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పాముల సంచారం అధికంగా ఉంటుంది.
Advertisement
Ranjith
Narayanpet Snake Bite
Telangana School Student Death
Eklaspur Government School
Snake Bite in Classroom

More Telugu News