తీవ్ర ఎండలు.. ప్రజలను కుక్క మాంసం సూప్ తాగండంటున్న ఉత్తర కొరియా

North Korea asks people to drink dog meat soup during severe heatwaves
  • తీవ్ర ఎండల వేళ ఉత్తర కొరియా కొత్త సూచన
  • కుక్క మాంసం సూప్ తాగాలని అధికారిక మీడియా సలహా
  • శరీరానికి శక్తినిస్తుందనే సంప్రదాయ నమ్మకం
  • దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవన్న నిపుణులు
  • ఎన్నో ఏళ్లుగా సంప్రదాయ ఆహారంగా ప్రభుత్వ ప్రోత్సాహం
  • కుక్క మాంసం వంటలకు ప్రత్యేక గుర్తింపు
ఉత్తర కొరియాలో తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ఓ సూచన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శరీరానికి శక్తినిస్తూ వేడి ప్రభావాన్ని తగ్గిస్తుందని చెబుతూ కుక్క మాంసంతో చేసిన సూప్ తాగాలని అక్కడి అధికారిక మీడియా ప్రజలకు సూచించింది.

ఉత్తర కొరియాలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారిక పత్రిక రోడాంగ్ సిన్మున్ సూచించింది. పుచ్చకాయ, దోసకాయ, పెసర, చేపల గంజి, ఎర్ర కందిపప్పు సూప్‌తో పాటు కుక్క మాంసం సూప్ కూడా వేసవిలో ఆరోగ్యానికి మంచిదని పేర్కొంది.

అక్కడి సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ సూప్ శరీరానికి శక్తినిచ్చి వేడి వల్ల కలిగే అలసటను తగ్గిస్తుందని భావిస్తారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఉత్తర కొరియాలో కుక్క మాంసం సూప్‌ను ఎన్నో ఏళ్లుగా సంప్రదాయ ఆహారంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక రెస్టారెంట్లకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు కొన్ని ప్రాంతాల వంటకాలను సాంస్కృతిక వారసత్వంగా కూడా గుర్తించారు. ప్యాంగ్యాంగ్‌లో కుక్క మాంసం వంటల పోటీలు కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి.

మరోవైపు దక్షిణ కొరియా మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. కుక్కల పెంపకం, వధ, మాంసం విక్రయాన్ని నిషేధిస్తూ 2024లో చట్టం తీసుకొచ్చింది. మూడేళ్ల గడువు తర్వాత 2027 ఫిబ్రవరి నుంచి ఆ నిషేధం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.
Advertisement
North Korea
Dog meat soup
Heatwave
Pyongyang
Summer health advice
Rodong Sinmun

More Telugu News