కారును ఢీకొట్టిన స్పీడ్ బైక్... గాల్లోకి ఎగిరిపడ్డ యువకులు!
- రాజస్థాన్‌లోని సిరోహిలో వేగంగా వచ్చి కారును ఢీకొట్టిన బైక్
- ప్రమాద ధాటికి గాల్లోకి ఎగిరిపడ్డ ఇద్దరు యువకులు
- ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్
రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అబూ రోడ్ జంక్షన్ వద్ద అతివేగంతో వచ్చిన ఓ మోటార్ సైకిల్, కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు గాలిలోకి ఎగిరి కారు బానెట్‌పై పడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
ఈ ఘటన ఈ నెల మూడో తేదీన రైల్వే స్టేషన్ క్రాసింగ్ వద్ద చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన బైక్, ఎదురుగా వస్తున్న కారును నేరుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒక యువకుడు కారు బానెట్‌పై పడగా, మరొకరు కారుపై నుంచి గాలిలో ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఒకరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.