రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి ఫోన్.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలని విన్నపం
- రాహుల్ గాంధీకి ఫోన్ చేసిన కిరణ్ రిజిజు
- డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కోరిన కేంద్రం
- మహిళా రిజర్వేషన్ల అమలు కోసమే ప్రయత్నమన్న రిజిజు
- మిత్రపక్షాలతో చర్చించి నిర్ణయం చెబుతానన్న రాహుల్
- కాంగ్రెస్ వైఖరిలో మార్పు లేదన్న వేణుగోపాల్
మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఫోన్ చేసి నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ అంశంపై రాహుల్ గాంధీతో రిజిజు మాట్లాడటం ఇది మూడోసారి అని తెలుస్తోంది. బిల్లుకు ప్రతిపక్షం సహకరిస్తే మహిళా రిజర్వేషన్ల అమలు వేగవంతమవుతుందని ఆయన వివరించినట్లు సమాచారం. లేదంటే మహిళల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని కూడా రిజిజు చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఈ అంశంపై రాహుల్ గాంధీ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం. ముందుగా కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇండియా కూటమి భాగస్వాములతో చర్చించి తర్వాత పార్టీ వైఖరిని వెల్లడిస్తామని రిజిజుకు చెప్పినట్లు తెలిసింది.
అయితే డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆ పార్టీ ఎంపీ కే.సి. వేణుగోపాల్ బుధవారం స్పష్టం చేశారు. గత పార్లమెంట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు.
బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేదు. మహిళా రిజర్వేషన్ల పేరుతో దేశ రాజకీయ, జనాభా సమీకరణాలను మార్చే ప్రయత్నం జరుగుతోందనే ఆందోళనతోనే బిల్లును వ్యతిరేకించినట్లు కాంగ్రెస్ గతంలో తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల పరిధిలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది.