మ్యాచ్ జరుగుతుండగా పిడుగుపాటుకు ఫుట్‌బాల్ ఆటగాడి మృతి.. ఇదిగో వీడియో!
- థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా విషాదం
- పిడుగుపాటుకు గురై 24 ఏళ్ల ఆటగాడు సోఫ్వాన్ అవే మృతి
- ఈ ఘటనలో మరో 12 మంది ఆటగాళ్లకు గాయాలు
- వర్షంలో మ్యాచ్ నిర్వహించడంపై వెల్లువెత్తిన విమర్శలు
థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా పిడుగుపడటంతో 24 ఏళ్ల సోఫ్వాన్ అవే అనే యువ ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం దక్షిణ థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో మరో 12 మంది ఆటగాళ్లు కూడా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. గోలోక్ ఎఫ్ఏ కప్ అనే స్థానిక టోర్నమెంట్‌లో భాగంగా సోఫ్వాన్ అవే ఆడుతున్న శామ్‌కోల్ట్స్ జట్టు, అబూ ఎక్స్ నాంగ్ సిరిన్ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతోంది. వర్షం పడుతున్నా ఆట కొనసాగుతుండగా, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మైదానంలో పిడుగుపడింది. పిడుగుపాటుకు సోఫ్వాన్ నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే సహచర ఆటగాళ్లు, సిబ్బంది అతని వద్దకు పరుగెత్తారు. కానీ, అప్పటికే అతను కదలిక లేకుండా పడి ఉన్నాడు.
ఈ ఘటనపై స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంత్ మాట్లాడుతూ.. "సంఘటనా స్థలంలో అత్యవసర వైద్య బృందాలు అతడిని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించాయి. కానీ, తీవ్రమైన గాయాల కారణంగా సోఫ్వాన్ ప్రాణాలు నిలవలేదు" అని తెలిపారు. మలేషియాకు చెందిన 'బెర్నామా' న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ కూడా సోఫ్వాన్ మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించింది. "ఈ విషాద సమయంలో అతని కుటుంబానికి, క్లబ్‌కు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని తన ప్రకటనలో పేర్కొంది.
ఈ ఘటన తర్వాత, ప్రతికూల వాతావరణంలో మ్యాచ్ నిర్వహించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. "తుపాను వాతావరణంలో మ్యాచ్‌లను ఆపడం తప్పనిసరి చేయాలి" అని ఒకరు కామెంట్ చేయగా, "నిర్వాహకులదే బాధ్యత, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి" అని మరొకరు అభిప్రాయపడ్డారు. 'ది ఇండిపెండెంట్' కథనం ప్రకారం.. థాయ్‌లాండ్‌లో పిడుగుపాటు మరణాలు సాధారణమే. వ్యాధుల నియంత్రణ విభాగం డేటా ప్రకారం 2020 నుంచి 2024 మధ్య దేశవ్యాప్తంగా 283 మంది పిడుగుపాటుకు గురయ్యారని, వారిలో చాలామంది అక్కడికక్కడే మరణించారని ఆ కథనం పేర్కొంది.