పరామర్శల పేరుతో బలప్రదర్శన ఎందుకు?: జగన్‌పై మంత్రి అనిత విమర్శలు
- పరామర్శల పేరుతో బలప్రదర్శన చేస్తున్నారని ఆరోపణ
- నిందితులను పరామర్శిస్తున్నారని విమర్శ
- జగన్ పర్యటనల వీడియోలు ప్రదర్శించిన అనిత
- అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని వైకాపాపై ఆరోపణ
- పరామర్శల వల్ల ముగ్గురు చనిపోయారని ఆరోపణ
- ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్న
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శల పేరిట బలప్రదర్శన చేస్తున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ఆయన బయట అడుగు పెడితే విధ్వంసం, అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.
రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడారు. బాధితులను కాకుండా నిందితులను పరామర్శించడం ఏంటని జగన్‌ను నిలదీశారు. ఆయన పర్యటనల్లో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియోలను మీడియాకు ప్రదర్శించారు.
‘‘వైకాపా నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బెట్టింగ్‌లో నష్టపోయి మృతి చెందిన వ్యక్తి విగ్రహావిష్కరణకు జగన్ వెళ్లారు. ఆయన కారు కింద ఓ వ్యక్తి పడినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా వైకాపా కార్యకర్తలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పరామర్శల సమయంలో మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి. పోలీసులను బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని ఆరోపించారు.
పరామర్శల పేరుతో నిర్వహిస్తున్న బలప్రదర్శనల వల్ల ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అనిత అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పని అయినా జరిగిందా అని జగన్‌ను ప్రశ్నించారు.