సాఫ్ట్‌వేర్ నుంచి హార్డ్‌వేర్‌కు.. కెరీర్ మార్చుకోవాలనుకున్న ఇంజనీర్‌కు వింత అనుభవం

Rejected For Entry Level Hardware Job For Not Having Of Experience
  • హార్డ్‌వేర్ ట్రైనీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
  • ఎంట్రీ లెవెల్ పోస్టుకు 3 నుంచి 5 ఏళ్ల అనుభవం అడిగిన కంపెనీ
  • ఉద్యోగ తిరస్కరణపై సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్
  • ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు అనుభవంపై మొదలైన ఆన్‌లైన్ చర్చ
ఓ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఉద్యోగ ఇంటర్వ్యూలో వింత అనుభవం ఎదురైంది. హైస్కూల్ విద్యార్హతతో ఎంట్రీ లెవెల్ ట్రైనీ ఉద్యోగానికి వెళ్తే, 3 నుంచి 5 ఏళ్ల అనుభవం లేదని కంపెనీ తిరస్కరించింది. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పంచుకోవడంతో, అది కాస్తా వైరల్‌గా మారింది. ఉద్యోగ మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న వింత పోకడలపై ఇది పెద్ద చర్చకు దారితీసింది.

గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి, హార్డ్‌వేర్ రంగంలోకి మారాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా, అనుభవం సంపాదించేందుకు 'నెట్‌వర్క్ అండ్ కేబులింగ్ ట్రైనీ' అనే ఎంట్రీ లెవెల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటర్వ్యూ సమయంలో రిక్రూటర్ తనను 'ఈ ఉద్యోగానికి మీరు పర్ఫెక్ట్ ఫిట్' అని చెప్పారని, కానీ చివరికి అనుభవం సరిపోలేదంటూ తిరస్కరించారని అతను వాపోయాడు. ట్రైనీ స్థాయి ఉద్యోగానికి ఎంత అనుభవం కావాలని అడగ్గా, 3 నుంచి 5 ఏళ్లు ఉండాలని చెప్పడంతో తాను షాక్ అయినట్లు తెలిపాడు.

ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం అనేక కంపెనీలు 'ఎంట్రీ-లెవెల్' ఉద్యోగాలకు కూడా గత అనుభవాన్ని అడుగుతున్నాయని, దీనివల్ల కొత్తగా ఉద్యోగాల్లో చేరాలనుకునేవారికి, కెరీర్ మార్చుకునేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది కామెంట్లు చేశారు. కొందరైతే, అభ్యర్థిని సున్నితంగా తిరస్కరించడానికే కంపెనీలు ఇలాంటి కారణాలు చెబుతాయని అభిప్రాయపడ్డారు.
Advertisement
Hardware Job
Software Job

More Telugu News