Advertisement

జగన్ కుటుంబంలో విషాదం.. పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి కన్నుమూత

Tragedy in Jagan family as uncle YS Anand Reddy passes away
  • వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ఆనంద్ రెడ్డి మృతి 
  • కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ రెడ్డి
  • పులివెందులలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొననున్న జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి (వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు) కన్నుమూశారు.


కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ రెడ్డి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆనంద్ రెడ్డి అకాల మరణంతో ఉమ్మడి కడప జిల్లాతో పాటు ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.


తన పెదనాన్న మరణ వార్త తెలుసుకున్న జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రేపు పులివెందులలో జరగనున్న వైఎస్ ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో జగన్ స్వయంగా పాల్గొననున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించారు.

Advertisement
YS Anand Reddy
YS Jagan Mohan Reddy
YSRCP
Pulivendula
Kadapa district
YS Bhaskar Reddy

More Telugu News