- స్థానిక ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందన్న అవినాశ్ రెడ్డి
- వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఆరోపణ
- కార్యకర్తలపై దాడులు చేసి, తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శ
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన పులివెందులలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, నామినేషన్ వేయాలంటేనే యుద్ధం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు సృష్టిస్తోంది. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారు. కార్యకర్తలపై దాడి చేసి, బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా తాము భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.