- హత్య కేసులో అరెస్టయిన వైసీపీ నేత జైలు నుంచే పోటీ
- తిరుపతి జిల్లా పెళ్లకూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా సత్యనారాయణ రెడ్డి
- భర్త తరఫున ప్రచార బాధ్యతలు చేపట్టిన భార్య ప్రభావతమ్మ
- ఓటు వేయాలంటూ జైలు నుంచి ఓటర్లకు లేఖ విడుదల
తిరుపతి జిల్లాలో ఒక ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసులో అరెస్టయి ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వైసీపీ నేత, స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచారు. నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ కమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
సత్యనారాయణ రెడ్డి తన అనుచరుల ద్వారా జైలు నుంచే నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఆయనతో పాటు ఆయన భార్య ప్రభావతమ్మ కూడా వైసీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేయగా, చివరి నిమిషంలో ఆమె తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో సత్యనారాయణ రెడ్డి పార్టీ అధికారిక అభ్యర్థిగా ఖరారయ్యారు. ప్రస్తుతం ఆయన తరఫున భార్య ప్రభావతమ్మే ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
గత నెల తిరుపతి జిల్లాలో జరిగిన బాలయ్య అనే వ్యక్తి హత్య కేసులో సత్యనారాయణ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. భూవివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ కేసులో ఆయన నాయుడుపేట కోర్టులో లొంగిపోగా, అప్పటి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో, పోలీసుల అనుమతితో ఆయన జైలు నుంచే ఓటర్లకు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. గత 40 ఏళ్లుగా తాను ప్రజాసేవలో ఉన్నానని, గతంలో సొసైటీ ప్రెసిడెంట్గా, మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్గా, మండల అధ్యక్షుడిగా పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా తనను గెలిపించాలని, జైలులో ఉన్నప్పటికీ పెళ్లకూరు ప్రజల సంక్షేమం కోసమే తాను పోటీ చేస్తున్నానని ఆయన తన లేఖలో అభ్యర్థించారు.