- ఆర్నాబ్ తుపానుపై ప్రజలకు మాజీ సీఎం జగన్ హెచ్చరిక
- ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచన
- రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
- రంగంలోకి దిగి సేవ చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపు
- తుపాను ధాటికి రద్దయిన 100కు పైగా రైళ్లు, పలు విమానాలు
ఆర్నాబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు, ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ప్రాణనష్టాన్ని నివారించడానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచించారు. బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి ఆహారం, తాగునీరు, మందులతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో రైతులకు అండగా నిలవాలని, వారికి పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ శ్రేణులు తక్షణమే సహాయక, పునరావాస కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు అండగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు. మరోవైపు, ఆర్నాబ్ తుపాను గంటకు 135 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో తీరం దాటింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావంతో 100కు పైగా రైళ్లు రద్దు కాగా, భోగాపురం విమానాశ్రయానికి చెందిన 28 సర్వీసులతో పాటు, గన్నవరం విమానాశ్రయం నుంచి నడవాల్సిన అన్ని విమానాలను రద్దు చేశారు.