- డిశ్చార్జి పిటిషన్లపై దూకుడుగా విచారణ
- సీబీఐ, ఈడీ కేసులపై కొనసాగుతున్న రోజువారీ విచారణ
- కేసుల భవిష్యత్తుపై సర్వత్ర ఉత్కంఠ
వైసీపీ అధినేత జగన్ ఆస్తుల కేసుల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసుల విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇండియా సిమెంట్స్‌కు సంబంధించిన ఛార్జిషీట్లో దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. అనంతరం, భారతీ సిమెంట్స్ కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను న్యాయస్థానం ప్రారంభించింది.
దశాబ్ద కాలంగా ఈ కేసులు విచారణ దశలోనే నిలిచిపోయాయని, వీటిని వేగవంతం చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో విచారణ ప్రక్రియ వేగమందుకుంది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ, ఈడీ కేసులపై న్యాయస్థానం రోజువారీ విచారణ చేపడుతోంది. ఇప్పటివరకు ఆరు సీబీఐ ఛార్జిషీట్లకు సంబంధించి మొత్తం 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తయింది.
జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, అయోధ్యరామిరెడ్డి వంటి పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. విచారణ పూర్తయిన ఈ 45 డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు ఒకేసారి తన ఆదేశాలను వెలువరించనుంది. దీంతో ఈ కేసుల భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.