మనం రోజూ దాటే రోడ్డుపై ఆ గీతలకు ‘జీబ్రా క్రాసింగ్’ అనే పేరు ఎలా వచ్చింది?
- 1951లో బ్రిటన్‌లో జీబ్రా క్రాసింగ్‌కు అధికారిక గుర్తింపు
- జీబ్రా చారల పోలికతో వచ్చిన పేరు
- రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రూపకల్పన
- దూరం నుంచే కనిపించే తెల్లగీతల డిజైన్
- ప్రపంచవ్యాప్తంగా పాదచారుల భద్రతకు గుర్తు
- ‘బెలిషా బెకన్స్’ బ్రిటన్‌లో ప్రత్యేక ఆకర్షణ
రోజూ రోడ్డు దాటేటప్పుడు ‘జీబ్రా క్రాసింగ్’పైనే నడుస్తుంటాం. చిన్నప్పటి నుంచే ఈ పేరు వింటూ వస్తున్నా.. ఆ పేరు ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చిందో కూడా ఎప్పుడూ ఆలోచించి ఉండరు. దీని వెనక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక సాధారణ రోడ్డు గుర్తులను.. ప్రపంచవ్యాప్తంగా పాదచారుల భద్రతకు చిహ్నంగా ఎలా మారిందో తెలుసుకుందాం..
వాహనాల పెరుగుదలతో మొదలైన ఆలోచన
మొదట్లో రహదారులపై పాదచారులు ఎక్కడి నుంచి అయినా రోడ్డు దాటేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో ప్రమాదాలు ఎక్కువయ్యాయి. దీంతో పాదచారుల కోసం ప్రత్యేక మార్గం అవసరమని బ్రిటన్ ప్రభుత్వం భావించింది. డ్రైవర్లకు దూరం నుంచే స్పష్టంగా కనిపించేలా పలు నమూనాలను పరీక్షించిన తర్వాత తెల్లగీతల డిజైన్‌ను ఎంపిక చేసింది.
జీబ్రా పేరు ఎలా పుట్టింది?
నలుపు రంగు రహదారిపై వెడల్పాటి తెల్లగీతలు వేయడంతో ఆ నమూనా జీబ్రా శరీరంపై ఉండే నలుపు-తెలుపు చారలను గుర్తు చేసింది. ప్రజలు దాన్ని సహజంగానే ‘జీబ్రా క్రాసింగ్’ అని పిలవడం ప్రారంభించారు. ఆ పేరు వేగంగా ప్రాచుర్యం పొందడంతో 1951లో బ్రిటన్‌లో అధికారికంగానూ దాన్నే స్వీకరించింది. ప్రజలు పెట్టిన ఆ పేరే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఈ డిజైన్ ఎందుకు ప్రత్యేకం?
తెల్లగీతలు దూరం నుంచే స్పష్టంగా కనిపించడం ఈ డిజైన్ ప్రధాన బలం. దీంతో డ్రైవర్లు ముందుగానే అప్రమత్తమై వాహన వేగాన్ని తగ్గించగలిగారు. నిర్మాణం కూడా చాలా సులభం కావడంతో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కడైనా అమలు చేయడం సులభమైంది. అందుకే దశాబ్దాలుగా ఈ నమూనాలో పెద్దగా మార్పులు అవసరం రాలేదు.
ప్రపంచమంతా స్వీకరించిన విధానం
బ్రిటన్‌లో విజయవంతమైన తర్వాత అనేక దేశాలు ఇదే తరహా జీబ్రా క్రాసింగ్‌లను అమలు చేశాయి. తక్కువ ఖర్చు, సులభమైన రూపకల్పన, అందరికీ వెంటనే అర్థమయ్యే గుర్తు కావడం దీనికి కారణం. ట్రాఫిక్ నిబంధనలు దేశానికోలా ఉన్నా, ఈ తెల్లగీతలు కనిపిస్తే అక్కడ పాదచారులకు ప్రాధాన్యం ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తారు.
చాలామందికి తెలియని ప్రత్యేకత
బ్రిటన్‌లో సంప్రదాయ జీబ్రా క్రాసింగ్‌ల వద్ద నలుపు-తెలుపు స్తంభాలపై పసుపు రంగుతో మెరుస్తూ ఉండే దీపాలను ఏర్పాటు చేస్తారు. వీటిని ‘బెలిషా బెకన్స్’ అని పిలుస్తారు. రవాణా భద్రతకు కృషి చేసిన లెస్లీ హోర్-బెలిషా పేరు మీద వీటికి ఆ పేరు వచ్చింది. రాత్రి వేళల్లో, వర్షం, పొగమంచు సమయంలో కూడా క్రాసింగ్ స్పష్టంగా కనిపించేందుకు ఇవి ఉపయోగపడతాయి. అయితే చాలా దేశాలు ఈ దీపాలు లేకుండానే జీబ్రా క్రాసింగ్‌లను ఉపయోగిస్తున్నాయి.