తప్పు అడ్రస్‌కు ఫుడ్ ఆర్డర్.. బ్లింకిట్ డెలివరీ బాయ్ నేర్పిన గొప్ప పాఠం!
- బెంగళూరులో ఘటన
- తప్పు అడ్రస్ ఇచ్చినా, సహనంతో అసలు చిరునామాకు డెలివరీ తెచ్చిన డెలివరీ బాయ్
- అదనంగా డబ్బు ఇచ్చినా తీసుకోని వైనం
- మంచి రేటింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి
- కస్టమర్లపై ఎక్కువ శ్రద్ధతోనే తన రేటింగ్ పెరిగిందని వివరణ
- పనితీరు అంటే ఏంటో నేర్పాడన్న ఎంబీఏ గ్రాడ్యుయేట్
బెంగళూరుకు చెందిన మాన్సీ శర్మ అనే మహిళ పొరపాటున తప్పు అడ్రస్‌కు బ్లింకిట్‌లో ఫుడ్‌ను ఆర్డర్ చేసింది. డెలివరీ బాయ్ ఫోన్ చేయడంతో యాప్ చూసి ఆమె తన పొరపాటును గుర్తించింది. తన అసలు చిరునామాకు తీసుకురాగలరా అని అడిగింది. దానికి అతడు అంగీకరించి దాదాపు మూడు కిలోమీటర్లు అదనంగా వెళ్లి ఆర్డర్‌ను అందించాడు.
అతడికి ఇబ్బంది కలిగిందని భావించిన మాన్సీ అదనంగా రూ.100 ఇవ్వాలని ప్రయత్నించింది. కానీ డెలివరీ బాయ్ ఆ డబ్బు తీసుకోలేదు. గత నెల తన రేటింగ్ 4.2గా ఉండేదని, కస్టమర్ల కోసం కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవడంతో ఇప్పుడు అది 4.8కు చేరిందని చెప్పాడు.
‘‘కస్టమర్ కోసం ఇంకొంచెం ఎక్కువ చేస్తే నా రేటింగ్ పెరుగుతుంది. అదే నాకు ప్రశంసలతో సమానం’’ అని అతడు చెప్పిన మాటలు మాన్సీని ఆకట్టుకున్నాయి. ఈ విషయాన్ని ఆమె లింక్డ్‌ఇన్‌లో పంచుకుంది. తనకు ఎంబీఏ ఉన్నా.. పనితీరు అంటే ఏంటో ఆ డెలివరీ బాయ్ నేర్పాడని పేర్కొంది. ఈ పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు కూడా డిగ్రీల కంటే పనిపై అంకితభావమే గొప్పదని కామెంట్లు చేశారు.