టాటా కార్లు కొనాలనుకునేవారికి షాక్.. జూలై 1 నుంచి ధరల పెంపు
- జులై 1 నుంచి టాటా కార్ల ధరల పెంపు
- గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెంపు
- అన్ని మోడళ్లకు వర్తింపు
- ముడి పదార్థాల వ్యయం, ద్రవ్యోల్బణమే కారణం
- ఇటీవల ఇతర కంపెనీలూ పెంచిన వైనం
ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ వాటిలో పెద్ద భాగాన్ని తామే భరిస్తున్నామని, అయితే కొంత భారాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. ధరల పెంపు అన్ని మోడళ్లపై ఒకేలా ఉండదని తెలిపింది. వాహనం, వేరియంట్‌ను బట్టి మారుతుందని స్పష్టం చేసింది.
ఇటీవల ఆటోమొబైల్ రంగంలో ధరల పెంపులు సాధారణంగా మారాయి. గత నెలలో హ్యుందాయ్ కూడా తన వాహనాల ధరలను రూ.12,800 వరకు పెంచింది. ముడి పదార్థాల ధరలు, కమొడిటీ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరగడమే కారణమని తెలిపింది. అలాగే మారుతి సుజుకి జూన్ నుంచి వివిధ మోడళ్లపై రూ.30,000 వరకు ధరలు పెంచగా మహీంద్రా కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే తన ఎస్‌యూవీలు, కమర్షియల్ వాహనాల ధరలను సవరించింది.
టాటా మోటార్స్ ధరల పెంపు ప్రకటన అనంతరం కంపెనీ షేర్లు కూడా మార్కెట్లో స్వల్ప లాభాలతో ట్రేడ్ అయ్యాయి. వాహన తయారీ సంస్థలు ఒకవైపు లాభదాయకతను కాపాడుకుంటూనే మరోవైపు కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలపై పెట్టుబడులు కొనసాగించేందుకు ధరల సవరణల మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.