ఇండేన్ గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే గ్యాస్ డెలివరీ!
- ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ సేవ ప్రారంభం
- 10 కిలోల తేలికైన కాంపోజిట్ సిలిండర్
- ఇండేన్ ఛోటూకూ ఎక్స్‌ప్రెస్ డెలివరీ
- నాలుగు నగరాల్లో సేవల ప్రారంభం
- త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ
ఎల్పీజీ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ పేరుతో తేలికైన 10 కిలోల కాంపోజిట్ గ్యాస్ సిలిండర్‌ను ప్రవేశపెట్టడంతో పాటు, బుక్ చేసిన నాలుగు గంటల్లోనే ఇంటికే డెలివరీ చేసే సేవను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవను ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది.
సంప్రదాయ ఉక్కు సిలిండర్లతో పోలిస్తే కొత్త 10 కిలోల కాంపోజిట్ సిలిండర్ బరువు తక్కువగా ఉంటుంది. దీంతో దాన్ని మోయడం, తరలించడం, వినియోగించడం మరింత సులభమవుతుందని ఇండియన్ ఆయిల్ తెలిపింది. గృహ వినియోగంతో పాటు చిన్న వ్యాపార అవసరాలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. బుక్ చేసిన నాలుగు గంటల్లోనే సిలిండర్‌ను ఇంటికే అందించేలా కొత్త సేవను రూపొందించింది.
ఈ సేవలో వినియోగదారులకు మరికొన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. తమకు అనుకూలమైన డెలివరీ సమయాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు. డిజిటల్ విధానంలో సులభంగా బుక్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో గ్యాస్ బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా మారుతుందని సంస్థ తెలిపింది.
ప్రస్తుతం పుణే, గురుగ్రామ్, ఇండోర్, కోయంబత్తూరు నగరాల్లో ఈ కొత్త సేవ అందుబాటులో ఉంది. వినియోగదారుల స్పందనను బట్టి త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు ఇండియన్ ఆయిల్ వెల్లడించింది.
అలాగే 5 కిలోల ఇండేన్ ఛోటూ సిలిండర్‌కు కూడా నాలుగు గంటల్లో డెలివరీ సేవను విస్తరించింది. చిన్న కుటుంబాలు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ఎక్కువగా వినియోగించే ఈ సిలిండర్‌ను కూడా త్వరగా అందించేలా చర్యలు తీసుకుంది.