తాజ్‌మహల్ చరిత్ర సాక్షిగా అమెరికాపై ఇరాన్ సెటైర్లు..!

Marco Rubio Taj Mahal visit sparks Iran criticism
  • మార్కో రూబియో తాజ్‌మహల్ సందర్శనపై ఇరాన్ విమర్శలు
  • రూబియోకు చరిత్ర, ఆర్కిటెక్చర్ తెలియదంటూ సెటైర్లు.
  • ముంతాజ్ మహల్ మూలాలను గుర్తుచేసిన ఇరాన్
  • తాజ్‌ నిర్మాణ శైలిపై పర్షియన్ సంస్కృతి ప్రభావం
భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆగ్రాలోని తాజ్‌మహల్ సందర్శన ఇప్పుడు దౌత్య వివాదానికి దారితీసింది. తాజ్‌మహల్ వద్ద తన భార్య జీనెట్ రూబియోతో కలిసి ఆయన దిగిన ఫొటోపై హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. రూబియోకు చరిత్రపై, శిల్పకళపై అవగాహన లేదంటూ ఘాటుగా విమర్శించింది.

ఇరాన్ పోస్ట్‌లో ఏముంది?
మార్కో రూబియో తాజ్‌మహల్ ముందున్న బెంచ్‌పై కూర్చొని దిగిన ఫొటోను షేర్ చేసిన కొద్దిసేపటికే ఇరాన్ కాన్సులేట్ స్పందించింది. ‘‘మార్కో రూబియోకు గనక తాజ్ మహల్ చరిత్ర, దాని నిర్మాణ శైలి తెలిసి ఉంటే.. ఆయన అక్కడ నిలబడి ఫొటోలు దిగేవారు కాదు’’ అని పేర్కొంది. ఈ కట్టడం ఓ మొఘల్ చక్రవర్తి తన ఇరానియన్ భార్యపై ఉన్న ప్రేమతో, ఇరాన్ దేశానికి చెందిన అద్భుతమైన శిల్పుల నైపుణ్యంతో నిర్మించినదని గుర్తుచేసింది.

అంతటితో ఆగకుండా ప్రస్తుత రాజకీయాలను కూడా ఇందులో ప్రస్తావించింది. ఓవైపు తాజ్ మహల్ లాంటి ప్రపంచ అద్భుతాలు ఇరాన్ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంటే.. మరోవైపు నేటి అమెరికా మాత్రం ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామంటూ బెదిరిస్తోందని, ఇతర సంస్కృతులను అవమానిస్తోందని ఇరాన్ కాన్సులేట్ ఆరోపణలు చేసింది.

తాజ్‌మహల్‌కు ఇరాన్‌తో బంధం ఏంటి?
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన మూడో భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం 1632లో ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. చరిత్రకారుల ప్రకారం తాజ్‌మహల్ నిర్మాణంలో పర్షియన్ (ఇరాన్) సంస్కృతి, వారసత్వ ప్రభావం ఎక్కువగా ఉంది. ముంతాజ్ మహల్ (అసలు పేరు అర్జుమంద్ బాను బేగం) ఇరాన్‌కు చెందిన ఓ ప్రముఖ పర్షియన్ ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ. ఆమె తాత మీర్జా ఘియాస్ బేగ్ టెహ్రాన్ నుంచి భారత్‌కు వలసవచ్చి అక్బర్ చక్రవర్తి కొలువులో చేరారు. ముంతాజ్ తల్లి కూడా ఇరాన్‌లోని ఖాజ్వీన్ ప్రాంతానికి చెందిన ఉన్నత కుటుంబానికి చెందినవారే.
Go Back to Shorts
Marco Rubio
Taj Mahal
Iran
US relations
India
Agra
Mumtaz Mahal
Persian architecture
cultural heritage

More Telugu News