- పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ 'హార్డ్-స్టేట్' సిద్ధాంతంపై ఆందోళన
- ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ విధింపు
- ప్రావిన్స్ ఖనిజ సంపదను చేజిక్కించుకునేందుకే ఈ చర్యలని అనుమానాలు
- ఈ చర్యలతో తీవ్రవాదానికి ఆయుధం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించిన నివేదిక
పాకిస్థాన్ సైన్యం అనుసరిస్తున్న కఠిన వైఖరి, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనలకు దారితీస్తున్నాయి. బలప్రయోగంతోనే తిరుగుబాట్లను అణచివేయవచ్చనే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ 'హార్డ్-స్టేట్' సిద్ధాంతం ఇప్పుడు ఈ ప్రావిన్స్‌లో పరీక్షకు నిలిచింది. అయితే, ఈ చర్యల వెనుక అసలు లక్ష్యం ప్రావిన్స్‌లోని అపారమైన ఖనిజ సంపదను చేజిక్కించుకోవడమేనని అంతర్జాతీయ నివేదికలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
'గ్రీక్ సిటీ టైమ్స్' ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్నికైన ప్రభుత్వాన్ని అకస్మాత్తుగా రద్దు చేసి, ఎమర్జెన్సీ విధించడం వెనుక పెద్ద వ్యూహం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 11న రాజ్యాంగంలోని ఆర్టికల్ 232, 234 కింద అత్యవసర అధికారాలను ఉపయోగించి ఫెడరల్ ప్రభుత్వం ప్రావిన్స్‌లో గవర్నర్ పాలన విధించింది. ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదిని కస్టడీలోకి తీసుకుంది. పాకిస్థాన్ 18వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఖనిజాలు ప్రావిన్సుల ఆధీనంలో ఉంటాయి. తాజా చర్యలతో ప్రావిన్షియల్ అసెంబ్లీ రద్దవడంతో, ఖనిజాలపై ఫెడరల్ ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లభించినట్లయింది.
దాదాపు 4 కోట్ల జనాభా, బలమైన రాజకీయ వ్యవస్థ, ఇప్పటికే కొనసాగుతున్న సాయుధ తిరుగుబాటు, పొరుగునే శత్రుదేశంగా భావించే ఆఫ్ఘనిస్థాన్‌తో సరిహద్దు వంటి క్లిష్టమైన పరిస్థితులున్న ఖైబర్ పఖ్తుంఖ్వాలో సైనిక వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భద్రతా వైఫల్యాల కారణంగానే ఎమర్జెన్సీ విధించామని ఇస్లామాబాద్ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 2026 ప్రథమార్ధంలోనే 122 మంది పోలీసులు మరణించగా, హింసాత్మక ఘటనలు గణనీయంగా పెరిగాయి.
ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేయడం, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం, ప్రావిన్స్ వనరులను కేంద్రం, విదేశీ కొనుగోలుదారులకు అప్పగించే ప్రయత్నం చేయడం వంటి చర్యలు తీవ్రవాద గ్రూపులకు కొత్త ఆయుధాన్ని అందించినట్లే అవుతుందని ఆ నివేదిక హెచ్చరించింది. ఇది ఖైబర్ పఖ్తుంఖ్వాను కూడా బలూచిస్థాన్ లాగా పాలనారహిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని, ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం కంటే భద్రతాపరమైన నష్టమే ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.