ఏఐ కాప్ రైటర్... యాప్ ను ఆవిష్కరించిన సజ్జనార్
- 'హైదరాబాద్ నగర పోలీస్' మరో చారిత్రాత్మక ముందడుగు
- అందుబాటులోకి కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్
- 10కి పైగా భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం
పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ 'హైదరాబాద్ నగర పోలీస్' మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషాపరమైన ఇబ్బందులు కలగకుండా, వారి ఫిర్యాదులను త్వరితగతిన, కచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా 'ఏఐ కాప్‌రైటర్' అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ఏఐ కాప్‌రైటర్ యాప్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆవిష్కరించారు. అనంతరం దాని పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీని ద్వారా 10కి పైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం ఉందని అన్నారు. చెప్పిన విషయాలను వెంటనే టెక్స్ట్‌గా మార్చి అనువదించవచ్చని చెప్పారు.
ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో సేవ్ అయ్యే సదుపాయం ఉందని తెలిపారు. వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు పెద్ద ఊరట లభిస్తుందని చెప్పారు. న్యాయానికి భాష అడ్డంకిగా ఉండకూడదన్న లక్ష్యంతో ఏఐ వినియోగిస్తున్నట్లు చెప్పారు.
మొదట హైదరాబాద్ పరిధిలోని 80కి పైగా పోలీస్ స్టేషన్‌లలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఎఫ్ఐఆర్ ప్రక్రియను వేగంగా, కచ్చితత్వంతో పూర్తి చేసేందుకు ఈ యాప్ దోహదపడుతుందని సజ్జనార్ పేర్కొన్నారు. బ్లూక్లౌడ్ సొల్యూషన్స్ సహకారంతో యాప్ రూపకల్పన చేసినట్లు చెప్పారు.