బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
- హుటాహుటీన కరీంనగర్ నుంచి హైదరాబాద్ తరలింపు
- గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స
- స్టంట్ వేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు
బండి సంజయ్ కూడా మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. శకుంతలకు గుండెపోటు రావడంతో బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా బండి భగీరథ్ పోక్సో కేసు మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.