పిఠాపురం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతోంది. మొత్తం 36 వార్డులకు గాను ఇప్పటి వరకు 8 వార్డుల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో జనసేన 4, టీడీపీ ఒక స్థానంలో జయకేతనం ఎగురవేశాయి. ఒక వార్డులో టీడీపీ రెబెల్ అభ్యర్థి గెలుపొందారు. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ రెబెల్ అభ్యర్థి గెలుపు స్థానికంగా సంచలనంగా మారింది.

వార్డుల వారీగా విజేతల వివరాలు:
1వ వార్డు - వజ్రపు వెన్నెల (స్వతంత్ర అభ్యర్థి)
2వ వార్డు - కామేశ్వరి (టీడీపీ)
3వ వార్డు - బొజ్జ వెంకటేశ్వరరావు (జనసేన)
5వ వార్డు - కొత్తపల్లి పద్మ (జనసేన)
6వ వార్డు - శిరీష (జనసేన)
7వ వార్డు - కరణం రుద్రయ్య (జనసేన)
8వ వార్డు - పాలికా పద్మరాణి (స్వతంత్ర అభ్యర్థి)
9వ వార్డు - మోర్తా చిన్నపండు (టీడీపీ రెబెల్).