తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు రంజీ క్రికెటర్ అని తెలుసా?
- తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు చామ మిలింద్
- హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్
- విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్
- ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ జట్లకు ప్రాతినిధ్యం
- టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన అరుదైన ఘనత
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన వేళ, ఆయన కుటుంబ నేపథ్యంపై ఆసక్తి నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు చామ మిలింద్ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ కావడం విశేషం. తండ్రి పోలీస్ శాఖలో అత్యున్నత స్థాయిలో ఉండగా, తనయుడు క్రీడారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
హైదరాబాద్‌కు చెందిన 31 ఏళ్ల చామ మిలింద్, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ మరియు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. ఆయన హైదరాబాద్ రంజీ జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గతంలో భారత అండర్-19 జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ వంటి జట్లకు ఎంపికయ్యాడు
తన కెరీర్‌లో మిలింద్ పలు కీలక విజయాలు అందుకున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో తమిళనాడుపై హ్యాట్రిక్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఏ, టీ20 ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ తన సత్తా చాటుతున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆల్‌రౌండర్ చామ మిలింద్, బంతితో పాటు బ్యాట్‌తోనూ మూడు ఫార్మాట్లలో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో అతని గణాంకాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన 82 టీ20 మ్యాచ్‌ల్లో 121 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కేవలం 18.23 సగటు, 14.5 స్ట్రైక్ రేట్‌తో వికెట్లు తీయడం అతని ప్రతిభకు నిదర్శనం. ఒకే మ్యాచ్‌లో 8 పరుగులకే 5 వికెట్లు తీయడం అతని అత్యుత్తమ ప్రదర్శన.
ఇక బౌలింగ్‌లో మిగతా ఫార్మాట్లలోనూ మిలింద్ తన ముద్ర వేశాడు. 56 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 137 వికెట్లు సాధించగా, 57 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 104 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 43 పరుగులకు 6 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నమోదు చేశాడు. ఎకానమీ రేటును అదుపులో ఉంచుతూ కీలక సమయాల్లో వికెట్లు తీయడం అతని ప్రత్యేకత.
చామ మిలింద్ కేవలం బౌలరే కాదు, అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ జట్టును ఆదుకోగల సమర్థుడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1402 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ (136), ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో లోయర్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు రాబట్టగలడు. ఈ ఫార్మాట్‌లో 140కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. మొత్తంగా, బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తనదైన శైలిలో రాణిస్తూ చామ మిలింద్ విలువైన ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు.