నేను కారులో ఏసీ వాడను, జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటాను: జ్యోతిరాదిత్య సింధియా

నేను కారులో ఏసీ వాడను, జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటాను: జ్యోతిరాదిత్య సింధియా

Jyotiraditya Scindias Hack To Beat The Summer Heat
  • మధ్యప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో తెలిపిన కేంద్రమంత్రి
  • ఎండవేడిని తట్టుకోవడానికి తాను ప్రాచీన భారతీయ పద్ధతిని పాటిస్తానని వెల్లడి
  • ప్రాచీన భారతీయ పద్ధతులు పాటిస్తానన్న సింధియా
తాను కారులో లేదా ఇతర చోట్ల ఏసీని ఉపయోగించనని, జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటానని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వేసవికాలంలో అందరూ జేబులో ఉల్లిపాయ పెట్టుకోవాలని సూచించారు. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ఎండవేడిని తట్టుకోవడానికి తాను ప్రాచీన భారతీయ పద్ధతిని పాటిస్తానని అన్నారు. తలను కప్పుకోవడం, జేబులో ఉల్లిపాయ ఉంచుకోవడం చేస్తానని అన్నారు.

ప్రజలు ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి ఈ విషయాలను గమనించాలని సూచించారు. కారులో ఏసీ ఉపయోగించనని, అలాగే ఏసీ ఉన్నచోట కూర్చోనని తెలిపారు. మే, జూన్ నెలల్లో 51 డిగ్రీల వేడిలో కూడా ప్రజలు తనను అడిగితే, ‘ఇది చంబల్ చర్మం అని చెబుతానని అన్నారు. ఇంకో విషయం కూడా చెబుతున్నానని, తాను చూడటానికి కొంచెం చిన్నవాడిలా కనిపిస్తానని, కానీ తన ఆత్మ చాలా పురాతనమైనదని అన్నారు.
Advertisement
Jyotiraditya Scindia's Hack To Beat The Summer Heat
Keep An Onion

More Telugu News