- పురపాలిక తీర్పును వినయంతో స్వీకరిస్తున్నామని తెలిపిన మంత్రి లోకేశ్
- గత రెండున్నరేళ్ల సుపరిపాలనకు ప్రజలిచ్చిన ఆశీర్వాదమే ఈ విజయమన్న లోకేశ్
- గెలుపొందిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు అభినందనలు
- అహంకారానికి తావులేదని, పార్టీలకతీతంగా అందరికీ సేవ చేస్తామని స్పష్టీకరణ
పురపాలిక ఎన్నికల ఫలితాలు సంబరాలు చేసుకోవడానికి కాదని, ప్రజలకు మరింత సేవ చేసేందుకు లభించిన అవకాశమని రాష్ట్ర మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో కూటమి ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో, ప్రజా తీర్పును తమ ప్రభుత్వం ఎంతో వినయంతో స్వీకరిస్తోందని, ఈ గెలుపు పట్ల తాము పొంగిపోవడంలేదని ఆయన పేర్కొన్నారు. పురపాలిక ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే ఈ విజయమని లోకేశ్ అభివర్ణించారు. ఈ విజయం కోసం సమష్టిగా కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కూటమి తరఫున గెలుపొందిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
"ఎన్నికలు ముగిశాయి. ఇక మా ఏకైక లక్ష్యం సేవ మాత్రమే. పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడికి సేవ చేస్తాం. ఇక్కడ అహంకారానికి ఎలాంటి తావులేదు" అని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ అసలైన బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు గతంలో కంటే మరింత కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా తీర్పు తమపై మరింత బాధ్యతను పెంచిందని, దానిని నిబద్ధతతో నెరవేరుస్తామని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.