- 65 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో కడప మేయర్ పీఠం గెలుపు
- విజయనగరం మేయర్‌గా 18 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి విజయం
- కడప కార్పొరేషన్లో 66 డివిజన్లకు గాను 58 టీడీపీ కైవసం
ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభంజనం సృష్టించింది. ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన కడప, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పీఠాలను టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీకి కంచుకోటగా భావించే కడపలో సైతం టీడీపీ ఘన విజయం సాధించడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
కడప నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి మాట్లి సువర్ణ దక్కించుకున్నారు. తన సమీప వైసీపీ అభ్యర్థి దీప్తిపై ఆమె ఏకంగా 65,588 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. సువర్ణకు మొత్తం 1,31,615 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడి 66 డివిజన్లకు గాను టీడీపీ 58 స్థానాల్లో విజయం సాధించగా, వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 4, జనసేన 2 డివిజన్లలో విజయం సాధించాయి.
విజయనగరం కార్పొరేషన్ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి అవనాపు భార్గవి 18,787 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడి మొత్తం 62 డివిజన్లలో టీడీపీ 35, జనసేన 6, బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందగా.. వైసీపీ 16 డివిజన్లతో సరిపెట్టుకుంది. మరో రెండు స్థానాల్లో ఇతరులు విజేతలుగా నిలిచారు.
ఈ రెండు కార్పొరేషన్లే కాకుండా తిరుపతి, చిత్తూరు, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, కర్నూలు వంటి అనేక నగరపాలక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులే మేయర్ పీఠాలను దక్కించుకున్నారు.