మమతా దీదీ, నేను బీజేపీయే మాంసాహారం తింటాను: నాగాలాండ్ నేత వీడియో
- బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం, గుడ్ల వినియోగంపై నిషేధం విధిస్తుందని ఆరోపణ
- మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల కౌంటర్
- హోటల్లో మాంసాహారాన్ని ముందు పెట్టుకుని కౌంటర్ ఇచ్చిన తెమ్జెన్
"మమతా దీదీ, నేను బీజేపీలోనే ఉన్నాను మరియు నేను మాంసాహారిని" అంటూ తాను ఒక హోటల్‌లో నాన్-వెజ్ తింటున్న వీడియోను షేర్ చేశారు.
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బెంగాల్ ప్రజలు చేపలు, బియ్యం తింటారని, కానీ మీరు చేపలు తినకూడదని చెబితే మరి ఈ ప్రజలు ఏం తినాలని బీజేపీని ఉద్దేశించి అన్నారు. ఈ ప్రచారాన్ని బీజేపీ ఇప్పటికే ఖండించింది. తాజాగా, తెమ్జెన్ తాను మాంసాహారంతో పాటు ఇతర వంటకాలు ఉన్న ప్లేట్ ముందు పెట్టుకుని తినడానికి సిద్ధంగా ఉన్న వీడియోను షేర్ చేశారు.