హర్మూజ్ గుండా వెళ్లే భారత నౌకలకు టోల్ ఫీజు లేదు: ఇరాన్ రాయబారి

Iran says no toll fee for Indian ships passing through Hormuz
హర్మూజ్ జలసంధి గుండా వెళుతున్న భారతీయ చమురు ట్యాంకర్ల నుంచి తాము ఎలాంటి టోల్ ఫీజును వసూలు చేయడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇరాన్, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుత క్లిష్ట సమయంలోనూ సానుకూల సంబంధాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. భారత్‌తో ఉన్న మైత్రి కారణంగా రవాణా ఉచితంగా సాగుతోందని అన్నారు.

అమెరికాతో చర్చలు పునఃప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ తమ డిమాండ్లకు అనుకూలంగా స్పందించాలని స్పష్టం చేశారు. మా షరతులను అమెరికా అంగీకరిస్తే, మరో విడత చర్చలు సాధ్యమవుతాయని అన్నారు. ఇటీవల తాత్కాలిక యుద్ధ విరమణ అనంతరం చర్చల సందర్భంగా అమెరికా అంగీకార యోగ్యం కాని డిమాండ్లు తమ ముందు ఉంచిందని పేర్కొన్నారు. అందుకే చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందని అన్నారు.

ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై మహమ్మద్ ఫతాలీ స్పందిస్తూ, ఇరాన్ సామర్థ్యం గురించి వాషింగ్టన్‌కు తెలుసని అన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో, భారత్, ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
Go Back to Shorts
Mohammad Fatali
Iran
India
Hormuz Strait
oil tankers
toll fee
US relations
trade relations
West Asia tensions

More Telugu News