సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్ దంపతులు
- సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుక
- ముంబయిలో జరిగిన పెళ్లికి హాజరైన లోకేశ్, బ్రహ్మణి
- అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల వివాహం
- నూతన వధూవరులను ఆశీర్వదించిన లోకేశ్ దంపతులు
ముంబయిలోని ప్రఖ్యాత సెయింట్ రెజిస్ హోటల్‌లో అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన లోకేశ్, బ్రహ్మణి దంపతులకు సచిన్ టెండూల్కర్ కుటుంబం సాదరంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను లోకేశ్ దంపతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహ మహోత్సవానికి దేశంలోని క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.


