- అనంతపురం జిల్లాలో ఎన్నికల విధుల్లో విషాదం
- అస్వస్థతకు గురై పోలింగ్ అధికారిణి హరిత మృతి
- కదిరదరకుంట పోలింగ్ కేంద్రంలో ఘటన
- కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ
- ప్రగాఢ సానుభూతి తెలియజేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో పోలింగ్ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు అకస్మాత్తుగా మరణించారు. ఈ ఘటన గురువారం కూడేరు మండలంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే, కూడేరు మండలం కాడదారకుంట గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా (ఏపీఓ) హరిత గౌడ్ (58) విధుల్లో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి వైద్య సిబ్బంది ఆమెను కుడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గుండెపోటు రావడంతో మధ్యాహ్నం సుమారు 12:50 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు.
మృతురాలు హరిత, డి.హిరేహళ్ మండలం పూలకుర్తి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా (ఎస్జీటీ) పనిచేస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయురాలు మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "అనంతపురం జిల్లా కూడేరు మండలం కాడదారకుంటలో ఏపీవోగా విధులు నిర్వహిస్తున్న టీచర్ హరిత గౌడ్ గారు గుండెపోటుతో కన్నుమూయడం చాలా బాధాకరం. అస్వస్థతకు గురైన వెంటనే అత్యవసర వైద్యం అందించినా ఫలితం లేక మృతి చెందడం ఈ విషాదం నెలకొంది. వారికి నివాళులు అర్పిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.