- ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మళ్ళీ ఉద్రిక్తత
- గిరిజనులపై దాడులు చేస్తే సహించబోమన్న మంత్రి సంధ్యారాణి
- సీఎం చంద్రబాబు కొఠియాపై ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడి
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొఠియా గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళుతున్న గిరిజనులను ఒడిశా పోలీసులు అడ్డుకుంటూ, వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కొఠియా గ్రామాల్లో పర్యటించి, అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఒడిశా అధికారుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ... కొఠియాలోని 29 గ్రామాల్లో ఒడిశా అధికారులు, పోలీసుల ఆగడాలు మితిమీరిపోయాయని విమర్శించారు. గిరిజనులను బెదిరించడం, దాడులు చేయడం, చివరకు కిడ్నాప్లకు పాల్పడటం దారుణమన్నారు. "ఎన్నికలు వద్దనుకుంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలి కానీ, అమాయక గిరిజనులపై ప్రతాపం చూపడం ఏమిటి?" అని ఆమె ప్రశ్నించారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దును భారత్-పాకిస్థాన్ సరిహద్దులా మార్చవద్దని హెచ్చరించారు. గిరిజనుల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
కొఠియా గ్రామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారని, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.