మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నమెంట్ షెడ్యూల్‌ను నిర్వాహకులు ప్రకటించారు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. వడోదర వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రెండుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) జట్లు తలపడనున్నాయి.

ఈ సీజన్‌లోని మొత్తం 22 మ్యాచ్‌లకు వడోదరలోని బీసీఏ స్టేడియం, ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం సమానంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ రెండు వేదికలకు డబ్ల్యూపీఎల్ నిర్వహణలో మంచి అనుభవం ఉంది. గతంలో 2023, 2025 సీజన్లలో బ్రబౌర్న్ స్టేడియం మ్యాచ్‌లకు వేదిక కాగా, 2025, 2026 సీజన్లలో వడోదర స్టేడియంలో మ్యాచ్‌లు జరిగాయి. గతేడాది ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచిన ఫైనల్ మ్యాచ్ వడోదరలోనే జరిగింది. విశేషమేమిటంటే, డబ్ల్యూపీఎల్ ఫైనల్ ముగిసిన వారం తర్వాత, ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరిగే తొలి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఈ రెండు మైదానాలే ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి.

టోర్నమెంట్‌లో తొలి 11 మ్యాచ్‌లు జనవరి 14 నుంచి 24 వరకు వడోదరలో జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 25న విరామం ఇచ్చి, మిగిలిన 9 లీగ్ మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో నిర్వహిస్తారు. ముంబైలో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 3 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగిలిన నాలుగు జట్లతో రెండేసి సార్లు తలపడుతుంది.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫిబ్రవరి 5న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫిబ్రవరి 7న జరిగే ఫైనల్‌లో అగ్రశ్రేణి జట్టుతో తలపడుతుంది. ఈ సీజన్‌లోని అన్ని మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్‌తో సహా, రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు ఏవీ లేవు.

డబ్ల్యూపీఎల్ 2027 పూర్తి షెడ్యూల్:
వడోదర (బీసీఏ స్టేడియం) 
జనవరి 14: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ 
జనవరి 15: గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్జ్ 
జనవరి 16: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
జనవరి 17: యూపీ వారియర్జ్ vs ముంబై ఇండియన్స్ 
జనవరి 18: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ 
జనవరి 19: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్జ్ 
జనవరి 20: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ 
జనవరి 21: యూపీ వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్ 
జనవరి 22: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
జనవరి 23: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ 
జనవరి 24: యూపీ వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్
జనవరి 25: విరామం
ముంబై (బ్రబౌర్న్ స్టేడియం, సీసీఐ) 
జనవరి 26: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
జనవరి 27: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ 
జనవరి 28: ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్జ్ 
జనవరి 29: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ 
జనవరి 30: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ 
జనవరి 31: యూపీ వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
ఫిబ్రవరి 1: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ 
ఫిబ్రవరి 2: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ 
ఫిబ్రవరి 3: ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్జ్
ఫిబ్రవరి 4: విరామం
ప్లేఆఫ్స్ 
ఫిబ్రవరి 5: ఎలిమినేటర్ 
ఫిబ్రవరి 6: విరామం 
ఫిబ్రవరి 7: ఫైనల్