వాస్తవాలు ఒప్పుకో... నేను కాదు మీ అహంకారమే ఓటమికి కారణం: కేటీఆర్‌కు కవిత కౌంటర్

Kavitha Counters KTR on BRS Defeat Claims Arrogance is the Reason
వాస్తవాలు ఒప్పుకో అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన తీర్పుపై కేటీఆర్ స్పందించారు. మద్యం కుంభకోణం పేరుతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేశారని, తెలంగాణలో ఆ కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. ఈరోజు కవితకు అనుకూలంగా వచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని అన్నారు.

మద్యం కుంభకోణం కారణంగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయంపాలైందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు కేటీఆర్ 'ఎక్స్' వేదికగా చేసిన పోస్టును చూశానని, తనపై పెట్టిన కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నట్లుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణమా సమాధానం చెప్పాలని నిలదీశారు.

ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, అభ్యర్థులను మార్చకుండా దోపిడీదారులకే తిరిగి టిక్కెట్లు ఇవ్వడం, అన్నింటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణి ఓటమికి కారణమని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈరోజు కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడటం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారని, ఇది సరైనపద్ధతి కాదని అన్నారు. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలని కేటీఆర్‌కు సూచించారు.
Go Back to Shorts
Kavitha
Kalvakuntla Kavitha
KTR
BRS Party
Telangana Politics
Delhi Liquor Scam
Assembly Elections

More Telugu News