Lavanya Tripathi: చిరంజీవి గారు ఇంట్లో ఎలా ఉంటారో మాకు తెలుసు: లావణ్య త్రిపాఠి
- తమ ఇల్లు లేడీస్ హాస్టల్ మాదిరి ఉంటుందని గతంలో సరదాగా వ్యాఖ్యానించిన చిరంజీవి
- చిరంజీవిని కొందరు ట్రోల్ చేసిన వైనం
- తమ కుటుంబం జోలికి ఎవరైనా వస్తే ఊరుకోబోనన్న లావణ్య
'అందాల రాక్షసి' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తక్కువ సమయంలోనే టాలెంటెడ్ హీరోయిన్ గా నిరూపించుకుంది. వరుస చిత్రాలలో నటిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసింది. ఇదే సమయంలో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో పడింది. ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో వరుణ్ తేజ్ ను పెళ్లాడి మెగా కోడలిగా వారి ఇంట అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కూడా నటనపై ఆసక్తితో ఆమె నటిగా కొనసాగుతోంది.
ప్రస్తుతం 'సతీ లీలావతి' అనే చిత్రంలో లావణ్య నటిస్తోంది. మార్చి 6న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న లావణ్య కీలక వ్యాఖ్యలు చేసింది. తమ కుటుంబం జోలికి ఎవరైనా వస్తే ఊరుకోనని ట్రోలర్స్ ను హెచ్చరించింది. చిరంజీవి గారు ఇంట్లో ఎలా ఉంటారో తమకు తెలుసని... తమ కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా మనవరాళ్లని ఎంత ప్రేమగా చూసుకుంటారో విమర్శలు చేసేవారికి అసలు తెలియదని అన్నారు. ఆయన చేసే పనుల్లో ఒక శాతం కూడా చేయలేని వాళ్లు... ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదని చెప్పారు.
వివాదం వివరాల్లోకి వెళ్తితే... 'బ్రహ్మానందం' అనే సినిమా ఫంక్షన్ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తమ ఇంటికి వెళితే లేడీస్ హాస్టల్ మాదిరి ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కవల పిల్లలు (వీరిలో ఒక బాబు) పుట్టిన వేళ చిరంజీవిని కొందరు మళ్లీ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రోలర్స్ పై లావణ్య త్రిపాఠి ఫైర్ అయింది.