Hong Kong Fire: పొగబారిన గోడలు, ఎక్కడ చూసినా శవాలు.. హాంకాంగ్ బిల్డింగ్ లో హృదయవిదారక దృశ్యాలు.. ఫొటోలు!

Hong Kong Fire Accident Massive Search Operation Underway
  • హైరైజ్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదంపై కొనసాగుతున్న విచారణ
  • ఇప్పటికే 146 మంది మరణించారని ప్రకటించిన అధికారులు
  • ఇప్పటికీ దొరకని మరో 150 మంది ఆచూకీ
  • 1980 తర్వాత నివాస సముదాయాల్లో జరిగిన అత్యంత విషాదకరమైన అగ్ని ప్రమాదం ఇదే
పసుపు రంగులో మెరిసిపోయిన ఆ గోడలు ఇప్పుడు పొగతో మసకబారాయి.. పిల్లల ఆటపాటలతో నిత్యం సందడిగా ఉండే కారిడార్లు నేడు మూగబోయాయి. చల్లటి గాలుల స్థానంలో కమురు వాసన నిండిపోయింది. హాల్, బెడ్ రూం, కారిడార్, మెట్లు.. ఇలా ఎక్కడ చూసినా కాలిపోయిన మృతదేహాలే కనిపిస్తున్నాయని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు చెబుతున్నారు. హాంకాంగ్ లోని ఓ నివాస సముదాయంలో ఏడు టవర్లు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.

ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 146కు చేరిందని అధికారులు తెలిపారు. మరో 150 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అగ్ని ప్రమాదం తర్వాత హాంకాంగ్ లోని భారీ అపార్ట్ మెంట్ బిల్డింగ్ లోపల సహాయక చర్యలు చేపట్టిన అధికారులు తాజాగా పలు ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. 1980 తర్వాత నివాస సముదాయాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో హాంకాంగ్ బిల్డింగ్ ప్రమాదమే అతిపెద్దదని చెప్పారు.

మానవ అవశేషాలను వెలికి తీస్తూ..

అపార్ట్ మెంట్ బయట ఇదీ పరిస్థితి..

పెచ్చులూడిపోయి, శిథిలమైన గోడలు..

ప్రమాద మృతులకు ప్రజల సంతాపం..
Hong Kong Fire
Hong Kong
apartment fire
building fire
fire accident
death toll
rescue operations
residential building fire
fatalities
উদ্ধার অভিযান

More Telugu News