JD Vance: నా భార్య ఉష కూడా క్రైస్తవురాలిగా మారుతుంది.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
- ఏదో ఒక రోజు ఆమె క్రైస్తవ మతంలోకి మారుతుందని ఆశిస్తున్నానన్న వాన్స్
- మతం మారకపోయినా తనకు ఇబ్బంది లేదని స్పష్టీకరణ
- ప్రతి ఆదివారం ఉష తనతో పాటు చర్చికి వస్తోందని వెల్లడి
- మిస్సిసిపీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రేక్షకుల ప్రశ్నకు సమాధానం
- క్రైస్తవ సువార్తపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఉద్ఘాటన
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ మత మార్పిడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందువుగా ఉన్న తన భార్య ఏదో ఒక రోజు క్రైస్తవ మతాన్ని స్వీకరించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆమె మతం మారకపోయినా తనకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. బుధవారం మిస్సిసిపీలో జరిగిన "టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ" కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జేడీ వాన్స్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఉష ప్రతి ఆదివారం నాతో పాటు చర్చికి వస్తోంది. నేను చర్చి ద్వారా ఎలా ప్రభావితమయ్యానో, ఆమె కూడా అలాగే ప్రభావితమవుతుందని ఆశిస్తున్నా. ఈ విషయాన్ని నా అత్యంత సన్నిహితులైన పది వేల మంది స్నేహితుల ముందు చెబుతున్నా. ఇది జరగాలని నేను నిజాయతీగా కోరుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవ సువార్తపై నాకు బలమైన విశ్వాసం ఉంది. నా భార్య కూడా అదే మార్గంలో నడుస్తుందని భావిస్తున్నా" అని వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకుల నుంచి "మీ భార్య ఉష క్రైస్తవ మతంలోకి మారతారా?" అని ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సమాధానమిస్తూ "చివరికి ఆమె క్రీస్తు వద్దకు రావలసి ఉంది కదా!" అని వ్యాఖ్యానించారు. జేడీ వాన్స్ క్రైస్తవ మత విశ్వాసాలకు కట్టుబడి ఉండగా, ఆయన భార్య ఉష భారతీయ మూలాలున్న హిందూ కుటుంబానికి చెందినవారు.