గుర్రం ధర రూ.15 కోట్లు.. గేదెకు రూ.23 కోట్లట!
- రాజస్థాన్ లోని పుష్కర్ లో జరుగుతున్న క్యాటిల్ ఫెయిర్
- ప్రదర్శనలో పలు బహుమతులు కొల్లగొట్టిన చండీగఢ్ గుర్రం ‘షాబాజ్’
- రాజస్థానీ గేదె ‘అన్మోల్’కు కళ్లు చెదిరే ధర.. రోజూ పాలు, నెయ్యి, డ్రైఫ్రూట్స్ తో పెంచుతున్న రైతు
షాబాజ్ గుర్రం వయసు కేవలం రెండున్నరేళ్లు మాత్రమే.. ఈ ప్రదర్శనలో షాబాజ్ పలు బహుమతులు అందుకుంది. దీనికి రైతు చెబుతున్న ధర రూ.15 కోట్లు కాగా కొనుగోలుదారులు రూ.9 కోట్ల వరకూ ఇచ్చేందుకు సిద్ధపడ్డారట. అయితే, ఆ ధరకు తాను అమ్మబోనని రైతు స్పష్టం చేశాడు. ఈ గుర్రం బ్రీడ్ కు రూ.2 లక్షల ధర పలుకుతోంది.
నలుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్న అన్మోల్ గేదె ఈ ప్రదర్శనలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఈ గేదెకు రోజూ పాలు, నెయ్యిలతో పాటు డ్రైఫ్రూట్స్ పెట్టి పెంచుతున్నట్లు రైతు చెప్పారు. దీనిని రూ.23 కోట్లకు అమ్మకానికి పెట్టారు.