టాలీవుడ్ యువ నటి సాహసం.. ఏకంగా విమానం నుంచి జంప్.. వైరల్ వీడియో
- దుబాయ్‌లో స్కై డైవింగ్ చేసిన భాగ్యశ్రీ బోర్సే
- విమానంలో చాలా ఎత్తుకు వెళ్లాక అక్కడి నుంచి జంప్ చేసిన నటి
- ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన యంగ్ బ్యూటీ
ఇక, స్కై డైవింగ్‌లో భాగంగా విమానంలో చాలా ఎత్తుకు వెళ్లాక అక్కడి నుంచి ఆమె సహాయకుడి సాయంతో పారాచూట్ వేసుకుని ధైర్యంగా కిందికి దూకేశారు. ఈ సాహసపూరిత జంప్ కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
కాగా, భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' మూవీతో పాటు రామ్ పోతినేని సరసన ఓ మూవీలో, దుల్కర్ సల్మాన్ 'కాంత' చిత్రంలో నటిస్తున్నారు.