Advertisement

నకిలీ నెంబర్ ప్లేట్ వాడితే వాహనం సీజ్ తో పాటు క్రిమినల్ కేసు: హైదరాబాద్ సిటీ పోలీసులు

Hyderabad City Police to seize vehicles and file criminal cases for fake number plates
  • నెంబర్ ప్లేట్లు మార్చే వారిపై పోలీసుల ఉక్కుపాదం
  • ప్రత్యేక తనిఖీల్లో ఆరుగురిపై కేసు నమోదు
  • హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు మాత్రమే వాడాలని సూచన

వాహన చలానాల నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లు మార్చినా, అంకెలు సరిగా కనిపించకుండా ట్యాంపరింగ్ చేసినా ఇక జైలు శిక్ష తప్పదు. నగరంలో నకిలీ నంబర్ ప్లేట్లతో రోడ్లపై తిరుగుతున్న వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గత వారం రోజులుగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా... ఫేక్ ప్లేట్లను వినియోగిస్తున్న ఆరుగురిపై ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


సుల్తాన్‌బజార్, మెహదీపట్నం, బహదూర్‌పురాలతో పాటు మేడిపల్లి, పెద్దపల్లి, కట్టంగూర్ ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. కొంతమంది నిఘా కెమెరాల నుంచి, ఈ-చలానాల నుంచి తప్పించుకోవడానికి నంబర్లను మార్చడం లేదా వేరే వాహనం నంబర్‌ను వాడుకోవడం లాంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.


పోలీసుల హెచ్చరికల ప్రకారం... ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన ‘హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు’ మాత్రమే వాహనాలకు ఉండాలి. నంబర్ ప్లేట్లపై ఏ విధమైన ఫ్యాన్సీ ఫాంట్లు, స్టిక్కర్లు, దేవుళ్ల బొమ్మలు లేదా నంబర్లను అస్పష్టంగా మార్చే ప్రయత్నాలు చేయకూడదు. నకిలీ ప్లేట్లతో దొరికితే కేవలం ఫైన్‌తో వదిలిపెట్టకుండా, వాహనం సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Advertisement
Hyderabad Traffic Police
Fake Number Plate Case
Vehicle Seizure Hyderabad
High Security Registration Plate
E Challan Evasion
Criminal Case Tampering

More Telugu News