భోగాపురం.. ఆధునిక ఎయిర్ పోర్టుకు ప్రతిరూపం: ప్రధాని మోదీ
- భోగాపురంలో రేపు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
- భోగాపురంలో సెమీకండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
- కర్నూలు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు శ్రీకారం
- కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులు జాతికి అంకితం
- సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించే ఈ ప్రాజెక్టుల వివరాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వీటిలో ప్రధాన ఆకర్షణగా విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తోంది. ఈ విమానాశ్రయానికి సంబంధించిన ఆకర్షణీయమైన ఫొటోలను కూడా ప్రధాని పంచుకున్నారు.
భోగాపురం విమానాశ్రయం ఒక ఆధునిక, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా నిర్మించిన ప్రాజెక్టు అని ప్రధాని అభివర్ణించారు. కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటకాన్ని ఇది గణనీయంగా పెంచుతుందని తెలిపారు. సుస్థిరత, ఇంధన సామర్థ్య సూత్రాలను పాటిస్తూ ఈ విమానాశ్రయాన్ని నిర్మించారని పేర్కొన్నారు.
వీటితో పాటు మరిన్ని కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నట్లు మోదీ వెల్లడించారు. భోగాపురంలో ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు, అలాగే కర్నూలు-IV పునరుత్పాదక ఇంధన జోన్ (ఆర్ఈజెడ్) మొదటి దశ అనుసంధానానికి సంబంధించిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
ఇదే క్రమంలో, రాష్ట్రంలో పూర్తయిన కొన్ని కీలకమైన రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు ప్రధాని తన పోస్టులో వివరించారు. వీటిలో ఎన్ హెచ్-365బీజీ పరిధిలోని రేచెర్ల - గురువాయిగూడెం మధ్య నాలుగు వరుసల రహదారి, గురువాయిగూడెం - దేవరపల్లి సెక్షన్, ఎన్ హెచ్-67పై నిర్మించిన తాడిపత్రి బైపాస్ ఉన్నాయని పేర్కొన్నారు.
విమానయానం, సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, రహదారి రవాణా వంటి కీలక రంగాల్లో చేపడుతున్న ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.