మూడోరోజూ కొనసాగిన లాభాలు.. 166 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
- 78,094.64 వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్
- 66.45 పాయింట్లు పెరిగి 24,383.60 వద్ద ముగిసిన నిఫ్టీ
- రాణించిన ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లు
- త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో మార్కెట్లకు ఊతం
- ఆర్థిక అనిశ్చితులు తగ్గితే ఈ ర్యాలీ కొనసాగొచ్చన్న నిపుణులు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. ఆటో, ఫైనాన్షియల్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లకు ఊతం లభించింది. మరోవైపు ఇటీవల భారీగా పెరిగిన ఐటీ షేర్లలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆ రంగంపై ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 166.49 పాయింట్లు పెరిగి 78,094.64 వద్ద, నిఫ్టీ 66.45 పాయింట్లు ఎగిసి 24,383.60 వద్ద ముగిశాయి.
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నిఫ్టీలో అత్యధిక లాభాలు నమోదు చేశాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 0.44 శాతం చొప్పున పెరిగాయి. ఆటో రంగంతో పాటు ఎఫ్‌ఎంసీజీ షేర్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచాయి. అయితే ఐటీ సూచీ ఐదు రోజుల లాభాల పరంపరకు బ్రేక్ పడింది.
ప్రస్తుతం నిఫ్టీకి 24,300 స్థాయి తక్షణ మద్దతుగా ఉంటుందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఆ స్థాయి కంటే దిగువకు వెళితే 24,200 వద్ద మరో కీలక మద్దతు ఉందన్నారు. త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా వస్తుండటం మార్కెట్లకు బలాన్నిస్తోందన్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు తగ్గితే ఈ ర్యాలీ కొనసాగొచ్చని అభిప్రాయపడ్డారు.