Advertisement

కుమార్తె వివాహానికి రావాలంటూ అల్లు అర్జున్‌కు పెళ్లి కార్డు అందించిన బండ్ల గణేశ్

Bandla Ganesh invites Allu Arjun for his daughter wedding
  • త్వరలో సూర్యతేజ చిలుకూరితో బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం
  • జోరుగా పెళ్లి పనులు
  • ప్రముఖులను కలిసి వివాహ పత్రికలు అందిస్తున్న బండ్ల గణేశ్
  • తాజాగా అల్లు అర్జున్ ను కలిసిన వైనం
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన కుమార్తె వివాహానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరి ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం సూర్యతేజ చిలుకూరితో త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బండ్ల గణేశ్ సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి పెళ్లి పత్రికలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం అల్లు అర్జున్‌ను ఆయన నివాసంలో కలిసి వివాహానికి రావాలని కోరారు.

ఈ కలయికపై బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "మా కుమార్తె వివాహ వేడుకలకు అల్లు అర్జున్ గారిని వ్యక్తిగతంగా ఆహ్వానించడం నాకూ, నా కుటుంబానికీ ఎంతో ఆనందాన్నిచ్చింది. నా బ్యానర్‌లో 'ఇద్దరమ్మాయిలతో' నటించిన హీరోగా ఆయనతో నాకున్న బంధం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. మా ఆహ్వానాన్ని స్వీకరించి, విలువైన సమయం కేటాయించిన బన్నీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, మద్దతు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Bandla Ganesh
Allu Arjun
Janani wedding
Bandla Ganesh daughter marriage
Iddarammayilatho
Telugu cinema news

More Telugu News