ఉత్కంఠ పెంచుతున్న 'అగధ'.. ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు
- ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ 'అగధ'
- ఆగస్టు 3న మధ్యాహ్నం 12 గంటలకు ట్రైలర్ విడుదల
- ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్
- టీజర్, పోస్టర్లతో సినిమాపై భారీగా పెరిగిన అంచనాలు
- కొత్త పోస్టర్‌తో మరింత క్యూరియాసిటీ పెంచిన చిత్రబృందం
ప్రముఖ ఫిలింమేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లతో ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆగస్టు 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దట్టమైన అడవిలో ఓ స్త్రీ సాధువు నిలబడి ఉన్న ఈ పోస్టర్, సినిమాలోని ఆధ్యాత్మిక, రహస్యభరితమైన అంశాలపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ పోస్టర్ సినిమాపై ఉన్న ఉత్కంఠను రెట్టింపు చేసింది. టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ‘అగధ’ ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ కె.ఆర్. సమర్పిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాకేష్ వెంకటాపురం సంగీతం అందించగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.