రఘురామకృష్ణరాజుపై జగన్ కక్షకు కారణమేంటో బయటపెట్టిన మంత్రి వాసంశెట్టి
- ‘సార్’ అని సంబోధించలేదనే రఘురామపై జగన్ కక్ష పెంచుకున్నారన్న మంత్రి వాసంశెట్టి
- డార్క్ రూములో ఉండి నలుగురితోనే జగన్ వ్యవస్థలను నడిపించారని విమర్శ
- ఎమ్మెల్సీ పదవి కోసం జగన్‌కు సాష్టాంగ నమస్కారం చేయమన్నారన్న వాసంశెట్టి
జగన్‌ను ‘సార్’ అని సంబోధించలేదని, ఆయన ముందు కాలిపై కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నారన్న కారణంతో నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై జగన్ కక్ష గట్టారని మంత్రి వాసంశెట్టి తెలిపారు. జగన్ బయటకు రాకుండా డార్క్ రూములో కూర్చొని నలుగురితోనే వ్యవస్థలను నడిపించారని పేర్కొన్నారు. మళ్లీ తానే సీఎం అవుతానని జగన్ భావించారని, ఆయన తీరుతో విసిగిపోయిన సొంత పార్టీ నాయకులే ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో ఏం చేయాలో తోచక కూటమి నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బుడమేరు వరదల సమయంలో కోటి రూపాయల సాయం చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదని విమర్శించారు. కోట్ల రూపాయలు సంపాదించినా జగన్‌లో సేవా గుణం లేదని వాసంశెట్టి విమర్శించారు.